Does beauty last forever?
శరీర సౌందర్యం నశించకమానునా? - అందం వాడిపోకుండా శాశ్వతకాలం నిలిచి ఉండునా?
హృదయ సౌందర్యం మరణంతరువాతకూడా నిలిచి ఉండకమానునా?
యవ్వనం కృంగిపోకుండా శాశ్వతకాలం నిలిచి ఉండునా? - బలం క్షీణించకుండా నిత్యం నీలో నిలిచి ఉండునా?
ధనం తరగకుండా శాశ్వతకాలం నీతో వచ్చునా? - మరణం నుండి తప్పించుకుని జీవించువాడెవడు?
పాతాళమునుండి తప్పించుకొనగలవాడెవడు? - జీవ మార్గమును వెదకి రక్షించుకొనగలవాడెవడు?
పరలోకములో ప్రవేశించగలవాడెవడు? - తన మనసును అదుపు చేసుకొనగలవాడెవడు?
తన రజోగుణములను అదుపుచేసుకొనగలవాడెవడు? - క్రోధమును జయించగలవాడెవడు?
ఈ శరీరమును జయించగలవాడెవడు? - జనన మర్మములను గూర్చి గ్రహించగలవాడెవడు?
ఈ సమస్త విశ్వప్రణాళికను ,సృష్టిని గూర్చి పరీక్షింపదగినవాడెవడు?
నరునియొక్క అవయవ నిర్మాణములను గూర్చి ఆలోచింపదగినవాడెవడు?
నరునిలోనికి ఆత్మ ఎక్కడనుండి వచ్చెను?
మరణం తరువాత ఆత్మ ఎక్కడికి పోవునో వివేకముతో గ్రహించి బ్రతుకగలవాడెవడు?
ఈలోకంలో సమస్తము వ్యర్థమని గ్రహించి దేవునియందు భయము, భక్తి గలిగి,
దైవజ్ఞానము పొందుకున్నవాడు మాత్రమే సమస్తమును జయించి దేవుని రాజ్యములో ప్రవేశించును.
అందం మోసకరం,సౌందర్యం వ్యర్థంమోసపోకు మిత్రమా,ఏది నీది కాదుఏది నీతో రాదూ
-David.

Comments
Post a Comment